గోదావరి, కృష్ణా నదుల వరద ప్రవాహం..తగ్గు ముఖం పట్టాయి. భద్రాచలం వద్ద ప్రస్తుతం 39.5 అడుగుల నీటిమట్టం ఉంది. కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద నీటిమట్టం 12.65 మీటర్లు ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్ & అవుట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

దింతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి బిగ్ అలర్ట్. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిస్సా అలాగే పశ్చిమగోదావరి తీరాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని ఈ సందర్భంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో 26 అలాగే 27 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం అలాగే విజయనగరం లాంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.