బాలికపై అత్యాచారం.. వ్యక్తిని కొట్టిచంపిన గ్రామస్తులు

-

బాలికపై అత్యాచారం కేసులో ఓ వృద్ధుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపినట్లు స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది.

స్థానికుల కథనం ప్రకారం.. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా ఆ షాపు నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడికి పాల్పడ్డారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు ఆ దెబ్బలకు తాళలేక మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందడంతో గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news