గుడ్ న్యూస్ : త‌గ్గిన ప్లాట్ ఫామ్ ధ‌ర‌లు

-

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్. రైల్వే స్టేష‌న్ ల‌లో ప్లాట్ ఫామ్ ధ‌ర‌ల ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ త‌గ్గించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 250 రైల్వే స్టేష‌న్ లో అమ‌లు అవుతుంద‌ని కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. దీని వ‌ల్ల ఇప్ప‌టి నుంచి ప్లాట్ ఫామ్ ధ‌ర రూ. 10 మాత్ర‌మే ఉంటుంది. అయితే గ‌తంలో కూడా ప్లాట్ ఫాం ధ‌ర రూ. 10 మాత్ర‌మే ఉండేది.

అయితే క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి స‌మ‌యం లో రైల్వే స్టేష‌న్ ల లో ర‌ద్దీ త‌గ్గించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్లాట్ ఫామ్ ధ‌ర‌ల ను విప‌రీతం గా పెంచింది. దాదాపు 400 శాతం పెంచి ప్లాట్ ఫాం ధ‌ర ను రూ. 50 చేసింది. ఈ నిర్ణ‌యం తో అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వం అనేక నిర‌స‌నలు కూడా వ్య‌క్తం అయ్యాయి. అయితే తాజాగా ప్లాట్ ఫాం ధ‌ర ను రూ. 50 నుంచి తిరిగి రూ. 10 కి త‌గ్గించింది. కాగ ప్లాట్ ఫాం ధ‌ర‌లు యాధాస్థితికి తీసుకురావ‌డం రైల్వే ప్ర‌యాణికులు కాస్త ఊర‌ట నిచ్చే అంశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version