మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులు వున్నాయి. వచ్చే నెల 19వ తేదీతో ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఆలోగా అప్లై చేసుకోండి. దీనిలో మొత్తం 12,523 ఖాళీలు వున్నాయి.
పోస్టుల వివరాలని చూస్తే.. ఎంటీఎస్ 11,994, హవల్దార్ 529 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ ప్యాస్ అయిన వాళ్ళు ఎమ్‌టీఎస్ పోస్టులకు దరఖాస్తు చెయ్యచ్చు. వయస్సు వచ్చేసి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అదే హవల్దార్ పోస్టులకు అయితే శారీరక ప్రమాణాలు తప్పని సరి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అదే హవల్దార్ పోస్టులకు అయితే పీఈటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ఏప్రిల్ నెల లో ఉండనుంది. పూర్తి వివరాలని https://ssc.nic.in/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.