మందంగా ఉండే అందమైన జుట్టుకోసం ఆయుర్వేద మూలికలు..

-

ఆరోగ్యమైన జుట్టు అందంలో భాగమే. ముఖ్యంగా ఆడవాళ్లకి జుట్టు ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తుంది. అందుకే జుట్టు రాలిపోతుంటే మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఆడవాళ్ళు బాధపడుతుంటారు. ఐతే జుట్టుకి సంబంధించిన సంరక్షణ చాలా ఖర్చుతో కూడుకున్నది. మార్కెట్లో జుట్టు సంరక్షణ సాధనాలు చాలా ఖరీదుగా ఉంటాయి. అందరూ వాటివంక చూడకపోవచ్చు. అలాంటి వారు ఇంట్లోనే జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోవడానికి కావాల్సిన ఆయుర్వేద మూలికల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఉసిరి

ఉసిరిలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయి మలినాలని పూర్తిగా తీసివేస్తుంది. దానివల్ల కుదుళ్ళకి పటుత్వం రావడంతో పాటు మృదువుగా తయారవుతాయి. ఇంకా పొడుగ్గాపెరిగి మందంగా కనిపిస్తాయి. ఉసిరి పేస్ట్ ని జుట్టుకి రాసుకుంటే చాలా లాభాలున్నాయి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె జుట్టుకి చేసే మేలు అంతా ఇంతా కాదు. జుట్టు మృదువుగా ఉండడానికి కొబ్బరినూనె చాలా ఉపయోగపడుతుంది.

కలబంద

కలబందని రసంలా తయారు చేసుకుని తాగినా, లేదా కలబంద రసాన్ని జుట్టుకి మాస్క్ లా తయారు చేసి పెట్టుకున్నా బాగుంటుంది. మాస్క్ చేసి పెట్టుకున్న గంట తర్వాత స్నానం చేస్తే చాలు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు

మృదువుగా మారుతుంది. చుండ్రు తగ్గిపోయి మెరిసే శిరోజాలు మీ సొంతం అవుతాయి.

భృంగరాజ

అన్ని ఆయుర్వేద తైలాల్లో అత్యధికంగా వాడే మూలకం ఏదైనా ఉందంటే అది భృంగరాజ మొక్క మాత్రమే. ఇది జుట్టుకి టానిక్ లా పనిచేస్తుంది. చుండ్రు, చింపిరి జుట్టు, పొడి జుట్టు మొదలగు సమస్యల నుండి విముక్తి లభించడానికి భృంగరాజ తైలం పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version