ఫోర్బ్స్ 2021 లిస్టులో మెదక్ కి చెందిన కొత్త కీర్తి రెడ్డి చోటు దక్కించుకుంది. 30సంవత్సరాల లోపు వయసు గల వారిలో 24ఏళ్ళ అమ్మాయి అత్యంత ప్రభావవంతురాలిగా చోటు దక్కించుకుంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురైన కొత్త కీర్తి రెడ్డి, ఈ అరుదైన ఘనతని సొంతం చేసుకుంది. లండన్ నుండి మేనేజ్ మెంట్ లో మాస్టర్ పట్టా అందుకున్న కీర్తి, ఆ తర్వాత స్టాట్విగ్ అనే కంపేనీలో చేరింది. చైన్ మేనేజ్ మెంట్లో క్లౌడ్ సర్వీసులని అందించే ఈ కంపెనీలో తనకూ 5శాతం వాటా ఉంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి స్టాట్విగ్ కంపెనీకి గ్లోబర్ ఇన్నీవేటర్ గా అవార్డు లభించింది. సప్లై చైన్ మేనేజ్ మెంట్ కి సంబంధించిన సేవలని అందిస్తూ కరోనా వ్యాక్సిన్ ని ప్రపంచమంతటా సప్లై చేయడానికి సిద్ధమైంది. ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకున్న కీర్తి రెడ్డి, తనిలా ఎదగడానికి కారణం తన తండ్రి నుండి వచ్చిన ప్రేరణే కారణం అని చెబుతుంది. లాజిస్టిక్స్ కంపెనీ ఉండడంతో అందులో ఆసక్తి పెరిగి నన్నిక్కడి వరకి తీసుకొచ్చిందని తెలిపింది.