ప్రస్తుతం భారతీయ సినిమాలో బయోపిక్ ల హవా నడుస్తుంది. వరుసగా బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు దర్శకులు. మార్కెట్ భారీగా ఉన్న నేపధ్యంలో నటులు కూడా వాటిపై దృష్టి పెట్టడంతో నిర్మాతలు కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్దమవుతున్నారు. ఈ ఏడాది దాదాపు 20 బయోపిక్ లు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే బయోపిక్ నామ ఏడాది అంటున్నారు సిని విశ్లేషకులు.
ఇందులో భాగంగా బాలివుడ్ లో దీపిక పదుకొనే నటించిన చపాక్ సినిమా కూడా విడుదల అవుతుంది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో కార్యక్రమం కూడా జరిగింది. ఈ సినిమా ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ నేపధ్యంలో సినిమా ఆడియో కార్యక్రమంలో భాగంగా వేదిక మీద ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఈ సినిమాలో ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఒక పాట పడుతున్నారు. ఆ పాటను ఆలపించే సమయంలో బాధితురాలు లక్ష్మీ కన్నీరు పెట్టుకుంది. అది చూసిన దీపిక కూడా కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత దగ్గరకు తీసుకుని ఓదార్చింది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను లో దీపిక లక్ష్మీ అగర్వాల్ గా నటిస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.