కేసీఆర్ ఫొటో తొలగించాలన్న ఆలోచన సరికాదు: సబిత

-

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న పుస్తకాల్లోని ముందుమాట పేజీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉండటంతో ప్రభుత్వం పుస్తకాల పంపిణీని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

కొన్ని పాఠశాలల్లో అధికారులు ముందు మాట పేజీని చించివేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సంఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలుగు పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకొని కేసీఆర్ ఫొటో, గుర్తులు తొలగించాలన్న ఆలోచన సరికాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జయలలిత బొమ్మలు ఉన్న బ్యాగులను స్టాలిన్, జగన్ ఫొటోలు ఉన్న కిట్లను చంద్రబాబు అనుమతించారని గుర్తుచేశారు. కెసిఆర్ పేరుందని చింపిన పేజీల వెనుక జాతీయగీతం, ప్రతిజ్ఞ ఉన్నా పట్టింపు లేదా అని మండిపడ్డారు. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించి పాలనపై దృష్టి పెట్టాలని సబిత హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news