తన షాప్ ఎదుట కొందరు మద్యం సేవిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వ్యక్తినే పోలీసులు చితకబాదారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే.. ఇందల్వాయి మండల కేంద్రంలో తన పాన్ షాప్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగుతున్నారని 100కు కాల్ చేసి కుమ్మరి సాయిలు ఫిర్యాదు చేశాడు.
అయితే, ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు ఎందుకు తీసుకోవట్లేదని సాయిలు పోలీసులు అడిగగా.. దారుణంగా కొట్టినట్లు బాధిత వ్యక్తి సాయిలు ఆరోపించారు.కాపాడాల్సిన పోలీసులే క్రూరంగా ప్రవర్తిస్తే సామాన్య ప్రజలు ఎలా బతకాలని, కారణం లేకుండా తమను చితకబాదిన పోలీసులపై కట్టిన చర్యలు తీసుకోవాలని సాయిలు అండ్ కో డిమాండ్ చేశారు.
ఫిర్యాదు చేసిన వాళ్లనే చితకబాదిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో పోలీసుల దాష్టికం
ఇందల్వాయి మండల కేంద్రంలో తన పాన్ షాప్ ముందు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగుతున్నారని 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన కుమ్మరి సాయిలు అనే వ్యక్తి
ఫిర్యాదు… pic.twitter.com/OhkIX0xppJ
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2025