సోషల్ మీడియా దెబ్బకు ప్రభుత్వాలే కూలుతున్నాయని తెలియక కొందరు.. అతిగా రియాక్ట్ అయి సామాన్యులను దుర్భాషలాడి ఏకంగా తమ జీవితాలను ఇరకాటంలో పడేసుకుంటున్నారు. అటువంటి వారిలో తాజాగా అలేఖ్య చిట్టి పచ్చడి బిజెసెస్ చేసే సిస్టర్స్ ఇరుకున్నారు.
ఆన్లైన్ ద్వారా పచ్చళ్ల బిజినెస్ చేసే అక్కాచెల్లెల్లు కస్టమర్లతోనే మిస్ బిహేవ్ చేశారు. ఎక్కడైనా వ్యాపారానికి వినియోగదారులే దేవుళ్లు అంటారు. అలాంటిది వీళ్లు ఆ దేవుళ్లనే తిట్టారు. వారినే కాకుండా వారి ఇంట్లో వాళ్లనూ తిట్టారు. ఇంకేముంది నెటిజన్లు ఊరుకుంటారా? ఓ ఆట ఆడేసుకున్నారు. ఇప్పటికీ ఆడుకుంటున్నారు.దెబ్బకు అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ అయ్యింది. తాజాగా అలేఖ్య చిట్టి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేకే చిట్టి అనారోగ్యం పాలైనట్లు ఆమె సోదరి సుమి తెలిపింది. ఇకనైనా ట్రోలింగ్ ఆపండి మాకు ఏ పచ్చళ్ళ బిజినెస్ వద్దు మమ్మల్ని వదిలేయండి? అంటూ వేడుకుంది.
అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ ?
ఆసుపత్రికి చేరిన పచ్చళ్ళ లొల్లి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అలేఖ్య చిట్టి
సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేకే చిట్టి అనారోగ్యం పాలైనట్లు తెలిపిన ఆమె సోదరి సుమి
ఇకనైనా ట్రోలింగ్ ఆపండి మాకు ఏ పచ్చళ్ళ బిజినెస్ వద్దు మమ్మల్ని… pic.twitter.com/6QIn4m7R8V
— BIG TV Breaking News (@bigtvtelugu) April 8, 2025