పేదల వైద్యం పట్ల పట్టింపు లేకపోవడం బాధాకరం : ఈటల రాజేందర్

-

బొల్లారం, అల్వాల్ ప్రభుత్వ ఆస్పత్రులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిర్మాణం పూర్తి చేసి దాదాపు ఎనిమిది నెలలు అయినా అల్వాల్ ఆస్పత్రి ఇంకా ప్రారంభించలేదు. ఈ రోజు వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి త్వరలో ప్రారంభించేలా చూస్తానని స్థానికులకు ఎంపీ ఈటల
రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్
సెంటర్ పేదలకు మంచి వైద్యం అందించేదని గుర్తుకు చేశారు. కానీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా.. పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కడితే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అని భావిచామని తెలిపారు.

అయితే బిల్డింగ్ పూర్తి చేసిన కాంట్రాక్టర్ కి  డబ్బులు రాలేదని తాళాలు వేసుకోవడంతో అనేక నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయని తెలిపారు. రాజకీయ పట్టింపులు, కాంట్రాక్టుల బిల్లులు రాకపోవడం పేదల ప్రజల వైద్యం పట్ల పట్టింపు లేకపోవడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version