ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంగ్ కోర్ వాట్. ఇది కాంబోడియాలో ఉంది. ఈ ఆలయం 500 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరాన్ని కలిగి ఉంది. ఈ ఆలయానికి చుట్టూ మరిన్ని శిఖరాలు కలిగి ఉంది. అద్భుతమైన శిల్పకళ, చుట్టు ప్రకృతి సౌందర్యం, నీటి సవ్వడిని కలగలసిన ప్రదేశం ఇది. ఎన్నో వింతలు, అద్భుతమైన విశేషాలకు నిలయం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుతోంది.
ఆలయం ప్రత్యేకతలు..
వెయ్యి శతాబ్దానికి చెందిన ఖ్మేర్ సామ్రాజ్యం పాలనలో కాంబోడియా నగరంలో అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించారు. తొలత ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించినా.. అనంతరం హిందూ రాజులు ఈ సామ్రాజ్యాన్ని పాలించారు. హిందువుల పాలనతో ఈ సామ్రాజ్యానికి కాంభోజ రాజ్యంగా పేరొందింది. యూరోపియన్ల రాకతో కాంబోడియాగా మారింది. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని సూర్యవర్మన్-2 అనే రాజు నిర్మించారు.
అన్ని దేవాలయాల కలయిక..
అంగ్ కోర్ వాట్ నగరంలో అప్పట్లోనే సుమారు 10 లక్షల మంది నివసించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆలయ ప్రాంతంలోనే దాదాపు 5 లక్షల మంది వరకు నివసించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఆలయానికి 40 కిలోమీటర్ల దూరంలో మహేంద్ర పర్వతగా పిలిచే మరో పెద్దనగరం ఉందని వీరు గుర్తించారు. అంగ్ కోర్ వాట్ కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. కొన్ని వందల దేవాలయాల సముదాయం. అంగ్ కోర్ వాట్ అంటే అర్థం ఏంటో తెలుసా.. దేవాలయాల నగరం అని. ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించిన దేవాలయం ఇది.
మేరు పర్వతంలా..
హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా ఈ ఆలయాన్ని అప్పటి రాజు నిర్మించారు. ఈ ఆలయ స్థానకేంద్రంపై 213 అడుగుల ఎత్తయిన భారీ గోపురం ఉంది. గోపురానికి నాలుగు దిక్కులా మరో చిన్న చిన్న నాలుగు గోపురాలు ఉన్నాయి. ఆలయానికి చుట్టూ నీటి కందకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కందకం 650 అడుగులు, 13 అడుగుల వెడల్పుతో సుమారు 5 కిలోమీటర్ల వరకూ చుట్టుకొలత ఉంటుంది.
ఆలయానికి తూర్పు, పశ్చిమం వైపు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా పరిగణిస్తారు. ద్వారానికి ఇరువైపులా గంభీరంగా కనిపించే రెండు సింహాల శిల్పాలు ఉంటాయి. ద్వారం నుంచి మొదలుకుని ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన గోపురం కింద అద్భుతమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఖ్మేర్ సామ్రాజ్యం పరిస్థితులు, రామాయణ, మహాభారత గాథలను శిల్పం రూపంలో చెక్కారు. ఈ ఆలయం ప్రపంచలోనే అతిపెద్ద ఇసుక రాతి నిర్మాణం.