దేశంలో చివరి విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఏడో విడత ప్రచారానికి ఎండ్ కార్డు పడింది.
దీంతో నేటితో దేశవ్యాప్తంగా ప్రచార మైకులు మూగబోయాయి. చివరి దశలో భాగంగా జూన్ 1న 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనున్నది. ఏడో దశలో ప్రధాని నరేంద్ర మోడీ సహా 598 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.
ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది.బీజేపీ తరపున నరేంద్ర మోడీ, అమిత్ షా ధ్వయం ప్రచారపర్వాన్ని కొనసాగించగా, ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రాలను చుట్టి వచ్చారు.