ఆంధ్రప్రదేశ్ లో మే13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసిన వెంటనే సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే బెయిల్ కండిషన్ నేపథ్యంలో… ఆ షరతులను సడలించాలని కోర్టును జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతిని ఇవ్వాలని విన్నవించారు. జగన్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు… విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది.
రేపు ఏపీకి రానున్నారు సీఎం జగన్. ఈ నెల 17న లండన్ కు వెళ్లారు సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ భార్య భారతి, కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించారు. దాదాపు 15 రోజుల తర్వాత రేపు ఏపీకి రానున్నారు ముఖ్యమంత్రి జగన్.