జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన, బిజెపి పొత్తుపై ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బిజెపి కలిసే ఉన్నాయని.. కలిసే ముందుకు వెళతామన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రజావ్యతిరేక విధానాలపై కలసి పోరాడతామని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని.. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని, అలా కలిసినంత మాత్రాన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆలయాల పై దాడులు పెద్ద ఎత్తున జరిగాయని.. ఆంధ్రప్రదేశ్లో హైందవ ధర్మం అపహాస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సత్య కుమార్, ఇతర నేతలపై దాడి అందరూ చూశారని.. తమ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉందని వెల్లడించారు.