రక్తం మరిగిన వాళ్ళు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు – మాజీ మంత్రి అనిల్

-

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదనే భయంతో ఉన్నవారే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇది ఎన్నికలకు ముందు సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రక్తం మరిగిన వాళ్ళు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళు టిడిపిలోకి వెళ్ళాక ఏం చేస్తారు? అని ఎద్దేవా చేశారు.

టిడిపికి అడ్డదారులు తొక్కడం ఎప్పుడు అలవాటేనని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో గెలుపు వైసిపి దేనని, తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ పాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకునే ధైర్యం టిడిపి నేతలకు ఉందా..? అని సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వానికి తిరిగి అధికారాన్ని అప్పగిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతమంది వైసీపీ నేతలు టిడిపిలోకి వెళ్ళినా పార్టీకి ప్రత్యేకంగా జరిగే నష్టం ఏమీ ఉండదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version