కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు పూర్తిగా రుణమాఫీ కాలేదని ఓ గిరిజన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆయన విజ్ఞప్తి చేశారు. పోయిన సంవత్సరం మిర్చి క్వింటాలుకు రూ. 23000/- ఉంటే, నేడు క్వింటాలుకు రూ. 12000/ మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా మిర్చి పంట కొనుగోళ్లు పరిశీలించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలకు సదరు రైతుతో మిగతా రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.‘రుణమాఫీ చేస్తాడని నమ్మి కాంగ్రెస్కు ఓటు వేసినందుకు లక్ష రూపాయల అప్పు ఉంది. ఇంకా రుణమాఫీ కాలేదు.బ్యాంకు వాళ్ళు అప్పు కట్టాలని వత్తిడి చేస్తున్నారు’ అంటూ బీఆర్ఎస్ నాయకుల ముందు తన గోడును గిరిజన రైతు వెళ్లబోసుకున్నాడు.
పోయిన సంవత్సరం మిర్చి క్వింటాలుకు రూ. 23000/-
నేడు క్వింటాలుకు రూ. 12000/-అసమర్థ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పాలనలో మిర్చి రైతు పరిస్థితి.
రుణమాఫీ చేస్తాడని నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు.
లక్ష రూపాయల అప్పు ఉంది ఇంకా రుణమాఫీ కాలేదు.
బ్యాంకు వాళ్ళు అప్పు కట్టాలని వత్తిడి… pic.twitter.com/4r8DOC0mNf— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) February 25, 2025