స్త్రీ జీవితంలో గర్భం దాల్చిన ఆ తొమ్మిది నెలలు ఎంతో ప్రత్యేకం అయినది. చాలా అందంగా మరియు కొన్ని సందర్భాల్లో బాధకు గురి చేస్తుంది. ఆ తొమ్మిది నెలలు భావోద్వేగ మరియు హార్మోన్ల మార్పులతో పాటు, గర్భిణీ స్త్రీకి అనేక శారీరక మార్పులు వస్తూ ఉంటాయి. వీటితో పటు అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అనేక మార్లు ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది. వీటిలో గుండెల్లో మంట అనేది చాలా సాధారణమైన ఫిర్యాదు. ఇది గర్భిణీ స్త్రీలలో 17 శాతం నుండి 45 శాతం మధ్య ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.
నిమ్మ మాత్రమే కాదు అల్లం కూడా మంచి ఔషధంలాగ పని చేస్తుంది. ఇది ఒక టానిక్‌గా పనిచేస్తూ, కడుపు మరియు జీర్ణక్రియతో అనుసంధానించబడిన వ్యాధులకు చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు . గర్భిణీ స్త్రీ అల్లంను కొంచెం వేడి నీటి లో వేసి ఉడికించి అలా చేసిన ఆ అల్లం టీని త్రాగవచ్చు. అలా తాగలేకపోతే కొంచెం చక్కెర వేసుకుని తీసుకోవచ్చు. ఇది నిజంగా మంచి ఉపశమనం కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో గుండెల్లో మంటను తగ్గించడానికి బాదం కూడా సహాయం చేస్తుంది. ప్రతి భోజనం తర్వాత కొన్ని బాదంని తింటే కడుపులోని రసాలను తటస్తం చేయడంలో సహాయపడుతుంది, ఇది గుండెల్లో మంటను తగ్గించవచ్చు లేదా నివారించవచ్చు. చూసారా ఎంత సులువుగా ఈ బాధ నుండి బయటపడొచ్చో..!