AGENT : ఇవాళ “ఏజెంట్” ప్రీ రిలీజ్ ఈవెంట్..గెస్ట్ గా టాలీవుడ్ స్టార్

-

అక్కినేని అఖిల్ మరియు సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం “ఏజెంట్”.. ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పోస్టర్ లు టీజర్ లను చూస్తేనే అర్ధమవుతోంది. కిక్ మరియు రేస్ గుర్రం లాంటి చిత్రాలను అందించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

అంతే కాకుండా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించడంతో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ సినిమా ఈ నెల 28వ తేదీన రిలీజ్‌ కానుండటంతో… ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పై కీలక ప్రకటన చేసింది చిత్ర బృందం. ఇవాళ వరంగల్‌ లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించనున్నట్లు ప్ర కటన చేసింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ ఈవెంట్‌ కు అక్కినేని నాగార్జున గెస్ట్‌ గా రా నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version