మంత్రి గారి హెలికాప్టర్ వస్తుంది.. మీ ధాన్యం తీసేయాలని రైతులకు వార్నింగ్

-

రేపు సీఎం రేవంత్ హూజూర్ నగర్ పర్యటన సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హెలికాప్టర్ వస్తుందని.. మీ వడ్లు తీసేయాలని స్థానిక రెవెన్యూ అధికారులు రైతులను బెదిరించినట్లు తెలిసింది. వారి సొంత పొలంలో ఆరపోసుకున్న వడ్లు తీసేయాలని రైతులకు అధికారుల హుకుం జారీ చేయడంతో పాటు
వీడియోలు తీసి ఏం చేస్తారు? ఏం చేయలేరు? అంటూ ఎమ్మార్వో దౌర్జన్యం చేసినట్లు సమాచారం.

ఈ ఘటన సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో శనివారం ఉదయం వెలుగుచూసింది. రైతులు ధాన్యం ఆరబోసుకున్న పొలం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, అర్జెంట్‌గా ధాన్యం మొత్తాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలివ్వడంతో తమ సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్నాం.. హెలిప్యాడ్ కోసం మా వడ్లు ఎందుకు తీయాలి? అని అధికారులను రైతులు నిలదీసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news