ఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవత్వం అనేది మంట కలిసి పోతుంది అన్న విషయం తెలిసిందే. కనీసం జాలి దయ అనేది లేకుండా ముక్కుపచ్చలారని చిన్నారుల విషయంలో కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులను నడిరోడ్డుపై దారుణంగా వదిలేసి వెళుతున్న ఘటనలు రోజురోజుకీ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే మూసాపేట పరిధి లో ఉన్న రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందును వదిలి వెళ్లారు. ఇక శిశువు ఒక్కసారిగా కేకలు పెట్టి ఏడవడం తో అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ సదరు చిన్నారిని చేరదీసి ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించింది. ఇక పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు ఆ చిన్నారిని అప్పగించింది సదరు మహిళ.