160 కిలోమీటర్ల పొడవున దెయ్యం పాదముద్రలు.. నేటికీ వీడని మిస్టరీ..!

-

దెయ్యాలంటే భయం ఉన్నా వాటి గురించి డిస్కస్ చేయడమంటే మాత్రం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అదేంటో ఆ టాపిక్ గురించి మాట్లాడుతుంటే..భలే క్రేజీగా ఉంటుంది కదా..అలాంటి వారికోసమే మేము ఒక ఆసక్తి కరమైన హర్రర్ స్టోరీని తీసుకొచ్చాం….స్టోరీ అంటున్నారు కదా..ఏదో కట్టుకథ అనుకుంటారామే..కానే కాదు..రియల్ స్టోరీ..దెయ్యం పాదముద్రలు 160 కిలీమీటర్ల వరకూ ఉన్నాయట. రాత్రికి రాత్రే విచిత్రమైన ఘటన జరిగింది…అదేంటో సింపుల్ గా తెలుసుకుందామా…

అది 1855. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ దెవన్, సౌత్ దెవన్ మధ్య ఉన్న ఎక్సే ఈస్ట్యువరీ ప్రాంతం. అక్కడే రాత్రి వేళ ఇది జరిగింది. ఫ్రిబ్రవరి నెల 8వ తేదీ రాత్రి మంచు బాగా కురిసింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలనీ… బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ రాత్రి వారికి ఓ గండంలా గడిచింది. తెల్లారే డోర్లు తీసి చూస్తే… అంతా తెల్లటి ప్రపంచం. ఇళ్లు, చెట్లు, రోడ్లు అన్నీ మంచుతో తెల్లగా కప్పబడి ఉన్నాయి.. అవేవీ వాళ్లను ఆశ్చర్యపరచలేదు.

ఎందుకంటే అక్కడ మంచు కురవడం పెద్ద మ్యాటరేం కాదు… కానీ ఓ విషయం వాళ్లను స్టన్ అయ్యేలా చేసింది. అదేంటంటో.. ఇంగ్లీష్ లెటర్ U ఆకారంలోని ముద్రలు వాళ్లకు మంచులో కనిపించాయి. అవి ఏ ఇంటి దగ్గర మాత్రమో ఉంటే… పెద్దగా చర్చ జరిగేది కాదేమో… కానీ అవి ఏకంగా 160 కిలోమీటర్ల వరకూ ఉన్నాయి. మరి అవి ఎవరి పాదముద్రలు? అంత దూరం అర్థరాత్రి వెళ్లిందెవరు? ఎందుకు వెళ్లారు? అనేది వారి ప్రశ్న.

ఫిబ్రవరి 9, 10న కూడా మంచు కురిసింది. అందువల్ల పాదముద్రలు కనిపించిన చోట కూడా మంచు కురిసి అవి మూసుకుపోయాయి. ప్రజలు వాటిని మర్చిపోయే ఛాన్స్ ఉంది. కానీ అక్కడే జరిగిందో చిత్రం. ఉన్న ముద్రలు మూసుకుపోగా… కొత్త ముద్రలు కనిపించాయి. ఇలా మూడ్రోజులు ఆ ముద్రలు కనిపించాయి. వాటిలో చాలావరకూ 10 సెంటీమీటర్ల పొడవు ఉంటున్నాయి. అడ్డంగా 7.6 సెంటీమీటర్లు ఉండేవి. కొన్నిచోట్ల ఏకంగా 20 నుంచి 41 సెంటీమీటర్ల పెద్దవి కనిపించాయి. ఇలా మొత్తం 30 లొకేషన్లలో ప్రజలు వాటి గురించి చెబుతూ టెన్షన్ పడ్డారు.

ఆ ముద్రలు చాలా వరకూ.. ఇళ్లు, గార్డెన్లు, కోర్ట్ యార్డులు, నదులు, మైదానాల్లో కురిసిన మంచుపై కనిపించాయి. ఇళ్ల పైకప్పులపై కురిసిన మంచులో అవి కనిపించాయి. ఆ పాదముద్రలన్నీ తిన్నగా నడిచినట్లు కనిపించాయి. ఎత్తైన గోడలపై కూడా అవి కనిపించాయి. మరీ చిత్రమేంటంటే.. అక్కడి 10 సెంటీమీటర్ల డ్రైన్ పైపులపై కూడా అవి కనిపించాయి. కొన్నైతే.. ఇదివరకు ఎవరూ ఎప్పుడూ వెళ్లని చోట కనిపించాయి. అక్కడి ప్రజలను ఈ ముద్రలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.

మనకు అంతుచిక్కని వాటికి మనం దెయ్యమో, దైవమో అనేసుకోవటం కామన్..అలాగే.. అవి ఏ ముద్రలో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉండటంతో.. ఆ సమయంలో కొందరు అవి సైతాన్ పాదముద్రలు అని చెప్పుకొచ్చారు. అందుకు వాళ్లు తమవైపు నుంచి బలమైన వాదన వినిపించారు. వాళ్లు చెప్పింది ఏంటంటే… మనుషులో, జంతువులో అయితే.. మంచు కురిసే సమయంలో.. అలా రకరకాల ప్రదేశాల్లో వెళ్లలేరు. అలాగే.. రాత్రికి రాత్రి 160 కిలోమీటర్లు వెళ్లడం మనిషి, జంతువుల వల్ల కాదు.. పైగా పాదముద్రలు పెద్దవిగా ఉండటం వల్ల అవి దెయ్యానివే అని కొందరు గట్టిగా వాదించారు. కానీ వాళ్ల దగ్గర కూడా ఆధారాలు లేవు. కానీ దెయ్యం పాదముద్రలు అనే వాదన స్థానికులను భయపెట్టింది.

కొంతమంది అవి గాడిదల కాళ్ల గిట్టల ముద్రలు అని అన్నారు. గాడిద నడిచినప్పుడు… మంచు కారణంగా.. పెద్ద పాదముద్రలు పడ్డాయి అని వాళ్లు వాదించారు. కానీ ఈ వాదన కూడా నిలబడలేదు. ఎందుకంటే.. ఇళ్లపై, సన్నటి గోడలపై, పైపులపై గాడిద ఎందుకు నడుస్తుంది అనే ప్రశ్న తలెత్తింది. పాయింటే కదా.. పైగా గాడిద అయితే.. 160 కిలోమీటర్లు ఎందుకు వెళ్తుంది అనే ప్రశ్నకు ఆన్సర్ లేకుండా పోయింది.

ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చి.. చివరకు అది మిస్టరీగా మారింది. 1994 వరకూ దీనిపై 14 రకాల పరిశోధనలు జరిగాయి. ఒక్కటీ కచ్చితమైన ఆన్సర్ ఇవ్వలేకపోయింది. కొంతమంది పరిశోధకులు.. అసలు 160 కిలోమీటర్లు అవి కనిపించాయా లేక అలాంటి తప్పుడు ప్రచారం చేశారా అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకూ ఇప్పుడు ఆన్సర్ లేదు. ఇలా ఆ పాదముద్రలు.. దెయ్యం పాదముద్రలు అనే పేరుతో ఫేమస్ అయ్యాయి. ఇంతకీ ఆ ముద్రలు ఎవరవై ఉంటాయంటారు..?

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version