తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మృతి చెందగా…శవాలు ఎగిరిపడ్డాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో విరుదునగర్ జిల్లాలో భారీ పేలుడు సంభంవించింది. తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా సత్తూర్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
మరో 7 గురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. సత్తూర్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు దాటికి ఎగిరిపడ్డారు కార్మికులు. అటు సమీపంలోని ఆరు ఇళ్ళు దగ్థం అయ్యాయి. ఇక ప్రమాదం జరుగగానే.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంది. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.