ఏపీలో వితంతు, ఒంటరి మహిళల పింఛన్లలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో గంరదగోళం ఉండడంతో వాటికి సరైన స్పష్టత ఇస్తూ ప్రభుత్వం సరికొత్త నిబంధనలు పొందు పరిచింది. ఇప్పుడు మారిన నిబంధనలు వర్తిస్తాయి. ఈ సరికొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.
– వితంతువులు లేదా విడాకులు తీసుకున్న మహిళల్లో కేటగిరి -2లో ఉన్న వారి పెన్షన్ వయస్సు 45 ఏళ్లుగా ఉంటుంది.
– ఇక వితంతువులు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు పిల్లలు లేకపోయినా, మైనర్ పిల్లలున్నా లేదా వారికి తిరిగి వివాహం అయ్యేంత వరకు లేదా సంపాదన మొదలయ్యే వరకు.. పిల్లలు మేజర్లు అయ్యే వరకు, లేదా మరణం.. వీటిల్లో ఏది ముందు అయితే అంతవరకు ఈ కుటుంబ పెన్షన్ లభిస్తుంది.
-ఇక పైన చెప్పుకున్న కేటగిరి -2 పెన్షన్ తీసుకునే కుటుంబంలో వేరే వ్యక్తులు కేటగిరి -1 పెన్షన్‌కు అర్హులు అయినా వారికి ఆ పెన్షన్ వర్తించదు. ఒక వేళ ఆ పెన్షన్ తీసుకుంటే అది క్రిమినట్ కేసు అవుతుంది.
– అలాగే, కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న తల్లి మృతిచెంది.. వివాహం కాని కుమార్తె ఉంటే ఆమెకు పాతికేళ్లు వచ్చే వరకు పెన్షన్ ఇస్తారు. వివాహమయ్యే వరకు లేదా ఆమె సంపాదన మొదలు పెట్టే వరకు పెన్షన్ అందిస్తారు. వివాహం జరిగాక మాత్రం పెన్షన్ తీసుకుంటే అది క్రిమినల్ కేసు అవుతుంది.
– కుటుంబ పెన్షన్ పొందుతున్న తల్లికి వివాహమైన తరువాత విడాకులు తీసుకున్న కుమార్తె ఉంటే.. ఆ కుమార్తె ముందుగానే అంటే 45 సంవత్సరాల వయస్సులోపే తన తల్లి మరణానంతరం పెన్షన్ తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు తల్లి మరణానంతరం ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అన్ని ఏళ్లపాటు పెన్షన్ ఇస్తారు.