వచ్చే వారమే కరోనా వ్యాక్సిన్ కి అనుమతి…?

-

కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో కీలక అడుగు పడనుంది. కరోనాపై పోరాటంలో దాదాపు 95 శాతం ప్రభావంతో పని చేస్తున్న ఫైజర్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు వచ్చే వారం ప్రారంభంలోనే యూకే ప్రభుత్వం నుండి నియంత్రణ ఆమోదం పొందే అవకాశం ఉంది అని జాతీయ మీడియా వర్గాలు అంటున్నాయి. ఫైజర్ ఇంక్ మరియు బయోఎంటెక్ ఎస్ఈ ద్వారా తయారు చేయబడిన కరోనా వైరస్ వ్యాక్సిన్ అధికారిక అనుమతి ప్రక్రియను బ్రిటిష్ రెగ్యులేటర్లు ప్రారంభించబోతున్నారని పేర్కొన్నారు.

డిసెంబర్ 1 నాటికి దీనిని పంపిణీ చేయడానికి రెడీగా ఉండాలని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మెడికల్ రెగ్యులేటర్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) చేత ఈ అనుమతి రానుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ కి సంబంధించి తుది దశ ట్రయల్స్ ఫలితాలు త్వరలో రానున్నాయి. ఫైజర్ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ కు సూపర్-కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది. ఇది భారత్ లో అందుబాటులో లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version