ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ దొంగిలిస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు

-

సంగారెడ్డి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ దొంగతనం చేస్తున్న ముఠాని పట్టుకున్నారు సంగారెడ్డి పోలీసులు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు.మూతబడిన పరిశ్రమలు, వ్యవసాయ బావుల దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ కాయిల్ దొంగలిస్తున్న వారిని అరెస్ట్ చేశామని తెలిపారు.పటాన్ చెరు, బొల్లారం, జిన్నారం, జహీరాబాద్ లలో ట్రాన్స్ఫార్మర్స్ లోని కాపర్ కాయిల్ చోరీ చేస్తున్నారని తెలిపారు.

సంవత్సరం నుంచి ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.నిన్న పోలీసులు తనిఖీలు చేయగా ఈ ముఠా పట్టుపడ్డట్లు తెలిపారు.ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, 2 ఆటోలు, ఓ మినీ లారీ స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై ఇప్పటివరకు 3 కేసులు ఉన్నాయన్నారు.నిందితుల నుంచి 4లక్షల 80 వేలు, 2 గొడ్డళ్లు స్వాధీనం, చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్స్ తీయడానికి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.మూతబడిన పరిశ్రమలు, పాడుబడ్డ బావులే టార్గెట్ గా ఈ ముఠా కాపర్ కాయిల్ చోరీ చేస్తున్నారని అన్నారు.వీరిని కోర్టులో ప్రవేశపెట్టి…కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version