ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ సర్కారు శుభవార్త

-

సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. సొంత ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటే . రూ.3 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. తాజాగా మంత్రి హరీష్ రావు సంగారెడ్డి లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్గారెడ్డిది టీఆర్‌ఎస్‌ కాకపోయినా..సంగారెడ్డిని అభివృద్ధి చేసామని వెల్లడించారు హరీష్ రావు.

సంగారెడ్డిలో 50 కోట్లతో అన్ని గల్లిల్లో రోడ్లు వేస్తామని.. ఈ 50 కోట్ల రూపాయలను వచ్చే ఆగస్టు నాటికి అన్ని రోడ్లు, డ్రైనేజీలు పూర్తి కావాలని చెప్పారు. కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చానని.. సీఎం గారు సంగారెడ్డి లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారని తెలిపారు.

మంచి నీళ్ళ కోసం 15 కోట్ల రూపాయలు ఇచ్చారని.. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నామని… రూపాయికి నల్లా కనెక్షన్ అందరకీ ఇవ్వాలని స్పష్టం చేశారు హరీష్‌రావు. ఆరునెలల్లో స్వచ్ఛ సంగరెడ్డిని నిర్మిస్తామని.. సంగారెడ్డిలో 500 కోట్ల తో మెడికల్ కాలేజ్ కట్టుకున్నామన్నారు హరీష్‌ రావు.రాబోయే రోజుల్లో 600 పడకలతో హాస్పిటల్ కడుతున్నామని.. మెడికల్ కాలేజ్ సీఎం గారు వచ్చి ప్రారంభిస్తారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version