గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఓ పోలీస్ కమిషనర్ కుప్పకూలాడు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి కమిషనర్ థామ్సన్ జోస్ కుప్పకూలాడు.
అనారోగ్యం, అస్వస్థతకు గురైన ఆయన కిందపడిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే కమిషనర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా..హీట్ స్ట్రోక్ వలన కళ్లుతిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.చికిత్స అనంతరం ఆయన యథావిదిగా తన విధులకు హాజరై కొనసాగించారు. కమిషనర్ పడిపోయే ముందు ఆయన కాస్త ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్
కేరళ – తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా పడిపోయిన సీపీ థామ్సన్ జోస్
ఆసుపత్రికి తరలింపు.. చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించిన కమీషనర్ pic.twitter.com/2nzMi3rNx6
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025