అహ నా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా రేవంత్ రెడ్డి పాలన ఉంది : కేటీఆర్

-

కాంగ్రెస్ పాలన పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహ నా పెళ్లంట సినిమాతో పోల్చారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. “మేము చిన్న పిల్లలప్పుడు అహ నాపెళ్లంట అని ఒక సినిమా వచ్చింది.. అందులో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ పిసీనారీ క్యారెక్టర్.. ఆయన ఏం చేస్తాడంటే నువ్వు మా ఇంటికి రా చికెన్ పెడుతా అంటాడు. పోతే.. కింద కూర్చొబెట్టి అన్నంలో పచ్చడి లేదా కారం వేసి కోడీని వేలాడదీస్తాడు. కోడిని చూసుకుంటా తిను అంటాడు.. ఇదే చికెన్ తినూ” అని చెబుతాడు.

సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం కూడా అలాగే ఉందని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొదలు ఏమి చెప్పిర్రు.. నూరు రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం అన్నారు. ఆరు నూరైనా.. భూమి ఆకాశం ఒక్కటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతామని గంభీరమైన డైలాగ్ లు వేశాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news