గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేసిందని మంత్రి పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదించిందని ఆయనవెల్లడించారు.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ”గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు అని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని నష్టం చేసింది అని మండిపడ్డారు. టెట్ పరీక్షను ప్రతి ఆర్నెల్లకొకసారి నిర్వహించాల్సి ఉండగా.. అలా చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారు అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టెట్‌లో తమ మార్కులు ఇంప్రూవ్ చేసుకొనే అవకాశం కోల్పోయారు అని అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు” అని వివరించారు.