గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది – వై.వి సుబ్బారెడ్డి

-

నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి. మంత్రి ఆదిమూలపు సురేష్ తో కలిసి వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించారు. టన్నెల్ లో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్లు, అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

రెండు టన్నుల్స్ లో కనీసం ఒక మీటర్ కూడా పనులు చేయలేదని మండిపడ్డారు వై వి సుబ్బారెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి టన్నెల్ పనులు పూర్తి చేశామని తెలిపారు. రెండవ టన్నులు కూడా పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి నీళ్లు అందిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version