ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో దారుణం చోటుచేసుకుంది. శ్రీ విజ్ఞాన్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్దినిని ఆ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమినట్లు సమాచారం. స్కూల్ బస్సులో వచ్చేటప్పుడు ఆ బాలిక అవహేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్కు డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.
దీంతో ఆగ్రహించిన స్కూల్ కరస్పాండెంట్ విద్యార్దిని చితకబాదాడు.దీంతో బాలిక ఇంటికి వెళ్లాక అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.కరస్పాండెంట్ దాడిలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స చేయించారు పేరెంట్స్. అనంతరం స్కూల్ కరస్పాండెంట్పై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.