ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఈడీఅధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని నిరసనలకు దిగారు. వరంగల్, హనుమకొండతో పాటు ఇతర జిల్లాల్లో రోడ్లపై బైఠాయించి ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.

కాగా,నిన్న ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news