రిలేషన్ షిప్ ఎక్కువ కాలం కొనసాగాలంటే కావాల్సిన చిన్న టిప్స్..

-

ఏ రిలేషన్ షిప్ అయినా ఎక్కువ రోజులు కొనసాగాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే హార్ట్ వర్క్ తప్పనిసరిగా చేయాలి. ప్రేమ, భద్రత మొదలగు వాటివల్లే రిలేషన్ షిప్స్ ఎక్కువ రోజులు నిలబడతాయి. ఈ రెండూ మీ దగ్గర ఎప్పుడైతే ఖాళీ అయిపోతాయో అప్పుడే మీ బంధంలో బీటలు రావడం మొదలవుతుంది. చిన్న చిన్న సమస్యల దగ్గర నుండి పెద్ద పెద్ద వాటి వరకు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఈ రోజు చిన్నవే కదా అనుకున్నవే రేపు పెద్ద నిర్ణయాలకు దారి తీయవచ్చు.

మీ భాగస్వామి ఇష్టా ఇష్టాలను తెలుసుకోండి. దానివల్ల ఇద్దరికీ అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. అలాగే అనవసరమైన సంఘర్షణలకి తావివ్వకుండా ఉంటుంది.

వ్యక్తిగత జీవితాల్లోకి మరీ చొచ్చుకుపోకుండా కొంచెం స్పేస్ ఇవ్వాలి. అలా అయితేనే బంధం బాగుంటుంది.

మీ బంధం బలపడడానికి సర్పైజెస్ లాంటివి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, భాగస్వామ్యం మొదలైన రోజుల్లో ఒకరి గురించి మరొకరికి తెలియడానికి ఇది మేలు చేస్తుంది.

మీ భాగస్వామికి చెప్పవలసిన రహస్యాలను దాచుకోవద్దు. అది చెప్పచ్చా లేదా అన్నది మీకు మీరే ఆలోచించుకోండి.

కమ్యూనికేషన్ గ్యాప్ అస్సలు మంచిది కాదు. ఒక విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు వారెలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోండి. లేదంటే ఇబ్బందుల పాలు కాక తప్పదు.

అప్పుడప్పుడు బయటలు వెళ్ళడం, కొత్త ప్రదేశాలు చూడడం బంధం బలపడడానికి బాగా పనిచేస్తాయి. కొన్ని సార్లు మీ భాగస్వామి చేసిన తప్పులని క్షమించేయండి. అహం వల్ల బంధం విడిపోవడం కంటే దురదృష్టం మరోటి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news