‘పుష్ప-2′ నుంచి రేపు రెండో సాంగ్ రిలీజ్!

-

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప-2′. పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే… రేపు ఉదయం 11.07 గంటలకు రెండో సాంగ్ రానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news