IPL 2024 : తేలిపోయిన సన్ రైజర్స్ …కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు క్వాలిఫైయర్-1లో సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తల పడుతున్నాయి. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.క్వాలిఫయర్-1 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణంగా విఫలం చెందారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ లో ఓపెనర్లు హెడ్ (0), అభిషేక్ (3)తో పాటు నితీశ్ (9), షాబాజ్(0) ఘోరంగా విఫలమయ్యారు. 5 ఓవర్లకే 39 రన్స్ చేసిన హైదరాబాద్ 4 కీలక వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత త్రిపాఠి(55), క్లాసెన్ (32), కమిన్స్ (30) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో స్టార్క్ 3, వరుణ్ 2, అరోరా, రసెల్, హర్షిత్, నరైన్ తలో వికెట్ తీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news