మన దేశం దైవత్వానికి నిలయం..మానవ నిర్మిత ఆలయాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉండటమే కాదు ఒక చరిత్ర కూడా ఉంది..అలాంటి దేవాలయాల్లో ఒకటి హాసనాంబ దేవాలయం.. ఈ ఆలయంలో ఎన్నో అతీత శక్తులు ఉన్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆలయ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఆలయం కర్ణాటకలో కొలువై ఉంది..ఈ ఆలయానికి తమ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానికులు చెబుతారు. హాసనాంబ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు. ఆ సమయంలో.. అమ్మవారిని ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు .. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.. ఈ ఆలయం హాసన్ లో ఉంది.. ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు.. ఎవరు నిర్మించారు అనేది రహస్యంగానే ఉంది.ఈ ఆలయాన్ని సందర్శించి దైవానుగ్రహాన్ని పొందగలిగితే ప్రజలు అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు..
ఈ ఆలయాన్ని సంవత్సరంలో ఒక వారం మాత్రమే తెరచి ఉంటుందని చెబుతున్నారు..హాసనాంబ అమ్మవారి ఆలయంలో ఏడాది మొత్తంలో వెలిగించిన దీపాలు, పూజించిన పువ్వులు, రెండు బస్తాల బియ్యం, నీరు పెట్టి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆలయం తెరిచే వరకు అమ్మవారికి వీటిని నైవేద్యాలుగా భావిస్తారు. ఆలయంలో నెయ్యి దీపం కూడా వెలిగిస్తారు. ఈ నెయ్యి దీపం ఆలయం మూసి వేసినప్పటికీ తిరిగి తెరచే సమయంలో కూడా వెలుగుతూనే ఉంటుంది. పువ్వులు వాడిపోవు. దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్నం కూడా వేడిగా ఉండి.. తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు.. అస్సలు బియ్యం అన్నంగా ఎలా మారింది.. పువ్వులు కనీసం వాడిపోవు.. అదేలా సాధ్యం అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది..
ఇకపోతే అమ్మవారి పేరే హాసనాంబ.. హాస్యం అంటే నవ్వు అని అర్థం. ఇక్కడ దేవత ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కనుక ఇక్కడ ఉన్న దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని స్థానికుల కథనం. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసిస్తే ఉగ్రరూపం దాల్చి వారి అంతు చూస్తుందని విశ్వాసం. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతారు. హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతారు. దీంతో తన అత్తగారిని బంగారాయిగా మారమని శపించిందట. అత్తగారి బండరాయి ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో కనిపిస్తుంది. అంతేకాదు అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ అత్తారాయి ఇంచు జరగడం మిస్టరీ..ఇక్కడ నైవేద్యాలు ప్రెష్ గా ఉండటం కూడా వింతనే చెప్పాలి.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆలయాన్ని ఒకసారి సందర్శించండి..