క్రోల్‌ సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యుయేషన్‌ జాబితాలో అల్లు అర్జున్ కు చోటు

-

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు అల్లు అర్జున్. ఈ మూవీతో దేశవ్యాప్తంగానే కాదు గ్లోబల్ లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్నారు. విదేశాల్లో కూడా పుష్ప హవా కొనసాగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బ్రాండ్ విలువ ఘనంగా పెరిగిపోయింది.

దేశంలో అత్యంత బ్రాండు విలువ కలిగిన అగ్రశ్రేణి 25 మంది జాబితాలో  అల్లు అర్జున్‌ తొలిసారి చోటు సంపాదించుకున్నారు. 2022 ఏడాదికి ‘సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యుయేషన్‌ స్టడీ’ నివేదికను ఆర్థిక సలహాల సంస్థ క్రోల్‌ విడుదల చేసింది. ఇందులో అగ్రశ్రేణి 25 మంది ప్రముఖుల బ్రాండు విలువ 160 కోట్ల డాలర్ల మేరకు ఉంది. 2021తో పోలిస్తే ఇది 29.1% పెరిగింది.

ఈ జాబితాలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ రూ.1500 కోట్ల (18.17 కోట్ల డాలర్ల)తో తొలి స్థానంలో నిలిచారు. తర్వాత విరాట్‌ కోహ్లి రూ.1450 కోట్లు (17.69 కోట్ల డాలర్లు), అక్షయ్‌ కుమార్‌ రూ. 1260 కోట్లు (15.36 కోట్ల డాలర్లు), ఆలియా భట్‌  రూ. 850 కోట్లు(10.29 కోట్ల డాలర్లు) ఉన్నారు. అల్లు అర్జున్‌ రూ.260 కోట్ల (3.14 కోట్ల డాలర్లు) బ్రాండు విలువతో 20వ స్థానంలో ఉన్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు రూ.219 కోట్లతో(26.5 కోట్ల డాలర్లు) 23వ స్థానంలో, సినీ నటి రష్మిక మందన్న రూ.209 కోట్ల (25.3 కోట్ల డాలర్లు) బ్రాండు విలువతో 25వ స్థానంలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version