రాజోలు ప్రజలు ఇచ్చిన చిన్న విజయమ్రస్త్ర రాజకీయాలకు వెన్నుముక గా నిలచింది అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.రాజోలు వారాహి విజయభేరి సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఇంకా మనకు 18 రోజులు మిగిలి ఉంది, 5 ఏళ్లుగా రోడ్ల మీద ఉన్నాం, మనవల్ల రాజకీయం అవ్వదు అని అందరూ అన్నా సరే మీ మీద నమ్మకంతో నేను 10 ఏళ్లుగా జనసేనను నిలబెట్టాను, గెలిపించుకోవాలి అని కోరారు.
2022 లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు, రైతులు ఎకరానికి 25 వేలు, కౌలు రైతులు 50 వేలు నష్టపోతున్నాం అని చెప్పారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరిగా అమ్మకాలు జరగట్లేదు, అమ్మినా డబ్బులు సకాలంలో ఇవ్వడం లేదు, పంట కాలవల పూడిక తీయడం లేదు, మరమ్మత్తులు చేయడం లేదు, కాలవ గట్టులను డంపింగ్ యార్డు గా మార్చింది వైసీపీ ప్రభుత్వం అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, వర ప్రసాద్ ఎంఎల్ఏ అభ్యర్థి అయినప్పటికీ, రాజోలు రైతుల సమస్యల పరిష్కారానికి నేను భాధ్యత తీసుకుంటాను అని అన్నారు.