రివైండ్ 2024: ఏఐ ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ జాబితా ఇదే

-

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు ఏఐ ఫీచర్లు కల ఫోన్ల కోసం తెగ వెతుకుతున్నారు. ఏయే స్మార్ట్ ఫోన్లలో మంచి ఏఐ ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. అయితే 2024లో మంచి ఏఐ ఫీచర్లు కలిగిన ఫోన్లో ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా:

ఏఐ ఫీచర్లు అధికంగా గల స్మార్ట్ ఫోన్లలో మొదటి వరుసలో ఇది ఉంటుంది. దీని ఏఐ ఫీచర్లలోకి వెళితే ముందుగా చెప్పుకోవాల్సింది చాట్ అసిస్ట్.

మనం చాట్ చేస్తుంటే.. తర్వాత రాయబోయే పదాలను అర్థం చేసుకుని స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తుంది. గ్రామర్ లో తప్పులు ఉంటే స్క్రీన్ మీద చూపిస్తుంది.

రియల్ టైం ట్రాన్స్ లేషన్:

దీన్ని ఉపయోగించి అవతలవారు మాట్లాడుతున్న దాన్ని తక్షణమే మన భాషలోకి అనువదించవచ్చు. ప్రస్తుతం 13 భాషల్లో ఇది సపోర్ట్ చేస్తుంది.

ఇంకా ఇమేజ్ ఎడిటింగ్, స్లో మోషన్ వీడియో వంటి వాటిల్లో ఏఐ టూల్స్ అద్భుతంగా ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో/ XL:

దీనిలో అందరినీ ఆకర్షించే ఏఐ ఫీచర్ ఏదైనా చెప్పుకోవాలి అంటే సమరైజ్ ఫీచర్ అని చెప్పవచ్చు. వాయిస్ రికార్డర్ యాప్ ఓపెన్ చేసి.. ఏదైనా వాయిస్ ని ప్లే చేసి TRANSCRIPT అనే బటన్ ని ప్రెస్ చేస్తే.. బుల్లెట్ పాయింట్స్ రూపంలో టెక్స్ట్ లో మొత్తం వచ్చేస్తుంది.

సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ సహాయంతో స్క్రీన్ మీద కనిపించిన ఒకదాన్ని సర్కిల్ చేసి డైరెక్ట్ గా గూగుల్ సహాయంతో సర్చ్ చేయవచ్చు.

ఇంకా ఏఐ జనరేటెడ్ వాల్ పేపర్స్, ఇమేజెస్ ని ఎడిట్ చేసేందుకు మ్యాజిక్ ఎడిటర్, బెస్ట్ టేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news