దాని పై ఆశ తోనే కెరియర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

-

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే నటీనటులు తమకు గుర్తింపు రావాలని కొంతమంది అడుగుపెడితే.. మరి కొంతమంది ఎక్కువ డబ్బు సంపాదించాలని అడుగు పెడుతూ ఉంటారు. మరికొన్నిసార్లు ఎక్కువ పారితోషకం డిమాండ్ చేసీ.. అవకాశాలు కోల్పోయిన నటీ నటులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ కూడా కేవలం 10 కోట్ల రూపాయలకు ఆశపడి తన కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకుంది.. ఆమె ఎవరో కాదు గజినీ ఫేమ్ ఆసిన్. తెలుగు ,తమిళ అనే తేడా లేకుండా వరుస సినిమాలలో నటించి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. గజిని సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు గా మారిన కేరళ కుట్టి అసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి , ఘర్షణ, లక్ష్మీనరసింహ, శివమణి వంటి సినిమాలలో నటించి చాలా చక్కగా తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అంతేకాదు ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో నటించినప్పటికీ ఆల్మోస్ట్ స్టార్ హీరోలతోనే నటించడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది అసిన్. గొప్ప భరతనాట్య కళాకారిణి కూడా. ఇంత ప్రతిభ ఉన్న ఈమె కేవలం రూ.10 కోట్లకు ఆశపడి కెరియర్ ని ఎందుకు నాశనం చేసుకుంది అనే విషయానికి వస్తే.. ఒక ప్రముఖ బ్రాండ్ కంపెనీ తో ఈమె రూ.10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై లో ఉన్న సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీ లో చేరగా ఆ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

ఒప్పందం ఏమిటంటే సంవత్సరం పాటు కంపెనీ లోనే ఉండాలి అని.. అందుకు గాను పది కోట్ల రూపాయల పారితోషిక ఉంటుందని ఆ ఒప్పందంలో ఉంది. తెలుగు, తమిళ సినిమాలకు దూరం అయి మరీ ఆ కంపెనీ విధించిన షెడ్యూల్లోని ఆమె నటించాలని నిర్ణయం తీసుకుంది.. ఇక అప్పటి వరకు తెలుగు , తమిళ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె కంపెనీతో ఒప్పందం తీసుకోవడం వల్ల భారీ ప్రాజెక్టులను సైతం వదులుకోవాల్సి వచ్చింది. అలా కేవలం పది కోట్ల రూపాయలకు ఆశపడి తన బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంది అసిన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version