బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం

-

బీఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్‌తో ఉన్న అనుబంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ప్రకటించింది.గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవితను కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

 

2004నుంచి పార్టీకి అనుబంధ సంఘంగా రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం కొనసాగింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 10 సంవత్సరాల కాలంలో విద్యుత్ కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పట్టించుకోలేదంటూ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు . ఈ మేరకు పార్టీతో 20 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version