వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం సీరియస్

-

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్ట్ సీరియస్ అయ్యింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు డిమాండ్ చేసింది. విచారణ పై తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సిబిఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. విచారణ త్వరగా ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సిబిఐ డైరక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సిబిఐ తరపు న్యాయవాది నటరాజన్ ని ఆదేశించింది.

సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ పై విచారణ చేపట్టింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నందున మార్చాలని పిటిషన్ దాఖలు అయింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు సిబిఐ తరపు న్యాయవాది. దీంతో ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version