నీట్ యూజీ కి సంబంధించిన పిటిషన్లను రేపు విచారించనున్న సుప్రీంకోర్టు

-

ఇటీవల జరిగిన నీట్-యూజీ 2024 ఎగ్జామ్ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది.వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌టీఏ దాఖలు చేసిన వాటితో సహా 40కి పైగా పిటిషన్‌లను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్‌లు మనోజ్ మిశ్రా,జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం విచారిస్తుంది.

జులై 11నే ఈ పిటిషన్లపై విచారించాల్సి ఉండగా, కొంతమంది పిటిషనర్ల తరఫున న్యాయవాదులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాఖలు చేసిన అఫిడవిట్లను అందుకోలేదని, వాటి పరిశీలన నిమిత్తం సమయం ఇస్తూ విచారణను జులై 18కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను గురువారం విచారిస్తుంది. మరోవైపు పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ తన నివేదికను కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. పేపర్ లీక్ బీహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితం అయిందని పేర్కొంది. కేంద్రం కూడా 2024-25 సంవత్సరానికి గానూ కౌన్సిలింగ్ ప్రక్రియను జులైమూడో వారం నుంచి 4 రౌండ్లలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news