ఎమ్మెల్సీలుగా 11మంది వైసీపీ సభ్యులు.. ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది సభ్యులు… కాసేపటి క్రితమే.. ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు ప్రమాణ స్వీకారం చేయగా… విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు.
తూర్పుగోదావరి నుండి అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు)… కృష్ణాజిల్లా నుండి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్ ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు… ప్రకాశం జిల్లా నుంచి తుమాటి మాధవరావు ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లా నుంచి భరత్… అనంతపురం జిల్లా నుంచి ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 11 మంది ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశ విదేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ గురించి చెప్పుకుంటున్నారని.. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ నాకు అవకాశం ఇచ్చిన సీఎం జగనుకు ధన్యవాదాలు చెప్పారు. మండలిలో వైసీపీ బలం 32కి చేరిందని.. మండలిలో టీడీపీ ఎలా చేసిందో చూశామన్నారు. మండలి ద్వారా సీఎం జగన్ చేస్తున్న నిర్ణయాలు ప్రజలకి చేరువ చేస్తామని వెల్లడించారు.