బ్రిటన్ దేశంలో ఓమిక్రాన్ కల్లోలం… రికార్డ్ స్థాయిలో పెరగుతున్న కేసులు

-

ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. దక్షిణాప్రికాలో మొదలైన కరోనా ఓమిక్రాన్ వేరియంట్ క్రమంగా తక్కువ వ్యవధిలోనే దాదాపు 50కి పైగా దేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ ఓమిక్రాన్ తో అల్లాడుతోంది. ఆ దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒకే రోజు బ్రిటన్ లో 101 ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 437కి చేరుకుందని బ్రిటిష్ ఆరోగ్య అధికారులు మంగళవారం ధృవీకరించారు. డెల్టా కంటే కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం క్యాబినెట్ తో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. శాస్త్రవేత్తలు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు .

మంగళవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం బ్రిటన్ 45,691 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంతగా కరోనావైరస్ కేసుల సంఖ్య 10,560,341 కు చేరుకుంది. ఆ దేశంలో కొత్తగా 180 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 145,826కి చేరుకుంది. బ్రిటన్‌లో 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో దాదాపు 89 శాతం మంది తమ మొదటి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.  81 శాతం కంటే ఎక్కువ మంది రెండు డోస్‌లను తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version