మృతదేహాలు బయటకు రావాలంటే టీబీకే మిషిన్ కట్ చేయాలి : మంత్రి జూపల్లి

-

ఎస్‌ఎల్‌బీసీ ట‌న్నెల్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో అడుగ‌డుగునా ఆటంకాలే ఏర్పడుతున్నట్లు సిబ్బంది వెల్లడించినట్లు తెలుస్తోంది. ముందుకు వెళ్తున్న కొద్దీ బుర‌ద‌,నీటి ఊట ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. 15 అడుగుల మేర బుర‌దను వెలికితీయడం పెద్ద టాస్క్‌గా మారినట్లు సమాచారం.

అయితే, ఇప్ప‌టికే టన్నెల్‌లోని మట్టిదిబ్బల కింద నాలుగు మృత‌దేహాలను గుర్తించినట్లు మంత్రి జూప‌ల్లి వెల్లడించారు. అయితే, వాటిని టన్నెల్ నుంచి బయటకు తీసుకురావాలంటే టీబీఎం మిషిన్‌ క‌ట్ చేయాలని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.కాగా, టీబీఎం మిషిన్ కట్ చేస్తే కోట్లలో నష్టం వాటిల్లుందని జేపీ గ్రూప్ సంస్థ చైర్మన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version