రోగ నిరోధక శక్తిని పెంచే మసాలా ఛాయ్.. కరోనా టైమ్ లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే..

-

భారతదేశ ప్రజలకు తెల్లవారగానే ఛాయ్ నోట్లో పడితే గానీ రోజు మొదలవదు. ఛాయ్ తాగగానే అదోలాంటి కొత్త ఉత్తేజం ఏదో వచ్చినట్టు అవుతుంది. ఛాయ్ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. మనసుకి ఉత్తేజాన్నిచ్చి, మరలా మరలా తాగాలనిపించే కోరిక కలిగించే ఛాయ్ ని తాగని వారు చాలా తక్కువ. ఐతే ఛాయ్ తో ప్రశాంతత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వుని కరిగించడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అదే కాకుండా మసాలా ఛాయ్ నశాలానికి పాకి నరాల్ని జివ్వుమనిపించి పునరుత్తేజాన్ని అందిస్తుంది. అలాంటి మసాలా ఛాయ్ రకాలేంటో అవి చేసే మేలేంటో తెలుసుకుందాం.

శొంఠి

శొంఠితో తయారు చేసిన టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లేమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు వాటి నుండి దూరం చేస్తాయి.

లవంగం

వంటగదుల్లో ఉండే లవంగంతో చేసే ఛాయ్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది జలుబును తగ్గించి, రక్త ప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. వైరస్, ఫంగస్ వంటి వాటివల్ల కలిగే అనారోగ్యాలను దూరం చేయడంలో లవంగం టీ పాత్ర చాలా కీలకం.

దాల్చిన చెక్క

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బయట నుండి వచ్చే వ్యాధులని అడ్డుకోవడంలో సాయపడతాయి. అలర్జీలను దూరం చేయడంలో దాల్చిన చెక్క కీలకం.

పసుపు

భారతదేశ వంటకాల్లో పసుపు స్థానం ప్రత్యేకం. దీనిలో ఉండే లక్షణాల కారణంగా రోగ నిరోధకశక్తి విపరీతంగా పెరుగుతుంది.

ఇవే కాదు ఇంకా తేనె, తులసి, పూదీన మొదలగు వాటితో చేసిన ఛాయ్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version