పీజీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..!

-

కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాసంస్థలను పునః ప్రారంభించేందుకు అనుమతి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిలిచిపోయిన వివిధ పరీక్షలు నిర్వహించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా కరోనా నిబంధనల మధ్య పరీక్షలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే డిగ్రీ మొదటి చివరి సెమిస్టర్ కు సంబంధించిన పరీక్షలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు పిజి చివరి సెమిస్టర్ కు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉన్నాయి.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఎలా రాయాలి అని విద్యార్థులు ఆందోళన పడుతున్న సమయంలో తెలంగాణ విద్యాశాఖ శుభవార్త తెలిపింది. పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రాసే విద్యార్థులు అందరూ తమ సొంత జిల్లాలోనే పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ విద్యాశాఖ. కరోనా దృశ్య విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకూడదు అన్న ఉద్దేశంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా ఈ నెల 19వ తేదీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పి జి చివరి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి .

Read more RELATED
Recommended to you

Exit mobile version