డెల్టా వేరియంట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన : రెండు కేసులు నమోదు !

-

రాష్ట్రంలో కరోన అదుపులో ఉందని.. డెల్టా రకం భారత్ సహా 135 దేశాల్లో డెల్టా తీవ్రత చూపిందని తెలంగాణ వైద్యశాఖ పేర్కొంది. దేశంలోని 50% కేసులు కేరళ నుంచేనని.. డెల్టా వైరస్ శరీరం పై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడం తో పాటు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని గమనించారని తెలిపారు. హైదరాబాద్ లో డెల్టా ప్లస్ కి సంబంధించి 2 కేస్ లు నమోదయ్యాయని.. సెకండ్ వేవ్ ఇంకా పూర్తి గా తగ్గలేదన్నారు.

ఖమ్మం, నల్గొండ, కరింనగర్ వంటి చోట్ల కేసులు అధికంగా ఉన్నాయని.. పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్ లో వుండకుండా బయట తిరుగుతున్నారని తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, ghmc, ఖమ్మం వంటి చోట్లా ఔట్ బ్రేక్స్ చూస్తున్నామని.. 3rd వేవ్ గా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదన్నారు.ఈ నెల లో ఇప్పటి వరకు 30.04 లక్షల డోస్ లు వ్యాక్సిన్ వచ్చాయి.. కేటాయించిన దానికన్నా 9.5 లక్షల డోస్ లు అదనంగా రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు. వచ్చే ఒకటి, రెండు వారాల్లో 2 డోస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ వేసుకున్న వారే హోటల్స్, మాల్స్ లో కి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని..డెల్టా వేరియాన్ట్ ప్రమాదకరం…ఇంటా బయటా ప్రజలు మాస్క్ లు ధరించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version